గాజువాక ప్రజలు నిర్ణయించిన గాజువాక మ్యానిఫెస్టోను అందజేస్తున్నాం

గత కొన్ని వారాలుగా, గాజువాక భవిష్యత్తు కోసం మీ యొక్క సలహాలు, సూచనలు కోసం నేను మిమ్మల్ని అడిగాను. మీరు ఎంతో అద్భుతమైన స్పందనలతో వచ్చినందుకు నేను కృతజ్ఞుడిని. మేము, మీ ప్రతిస్పందనల నుండి కీలకమైన అంశాలు సేకరించి, చర్చించి ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసాము. ఈ మేనిఫెస్టో, గాజువాక ప్రజలచే నిర్ణయించబడినందున ఈ మేనిఫెస్టో చాలా చరిత్రాత్మకమైనది.

ఈ మేనిఫెస్టో లోని అంశాలన్నీ నిలబెట్టుకుంటానని, గాజువాక నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మేము సమగ్ర అభివృద్ధి మరియు వేగవంతమైన పురోగతిని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, మీరందరూ నా పక్కన ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను.

జగనన్న ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు మరియు మనము ఎంతో ప్రేమించే గాజువాకకు రానున్న కాలంలో మరింత అభివృద్ధి జరుగుతుందని దృఢమైన నమ్మకంతో..

………మీ గుడివాడ అమర్నాథ్.

మ్యానిఫెస్టోను డౌన్‌లోడ్ చేయండి